టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ట్రెయిల్స్ పదవికి మెహ్లి మిస్త్రీ రాజీనామా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కొనసాగేది లేదని మెహ్లి మిస్త్రీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 30తో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బోర్డుకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు వెల్లడించారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం తర్వాత ప్రముఖ సంస్థల నుంచి ఆయన వైదొలగడం ఇది ఆరోసారికావడం గమనార్హం. ప్రస్తుతం టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా నేతృత్వంలో ఈ బోర్డు వ్యవహారాలు కొనసాగుతున్నాయి.