హైవేపై లారీ బీభత్సం: ఆటో ట్రాలీ ఢీకొని ఇద్దరు దుర్మరణం

రిపోర్టర్: రమేష్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా కొల్లూరు సమీపంలోని బాహ్య వలయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పటాన్చెరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆటో ట్రాలీ అదుపుతప్పి డివైడర్ వద్ద మొక్కలకు నీళ్లు పోస్తున్న కార్మికుడు శ్రీనివాస్ తో పాటు వాటర్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో కార్మికుడు శ్రీనివాస్, ఆటో డ్రైవర్ శ్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు.