కసుమూరు దర్గా గంధం మహోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం.. రోడ్లపై మురుగు నీరు, చెత్తతో భక్తుల అవస్థలు!
రిపోర్టర్: sujith reddy
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీలోని ప్రసిద్ధ మస్తాన్ వలి దర్గా గంధం మహోత్సవం సందర్భంగా అధికారులు పారిశుధ్య నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగు కాలువలు నిండిపోయి మురుగు నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నా పంచాయతీ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.