కరువు మండలాలను తక్షణమే ప్రకటించాలంటూ వైయస్ జగన్ డిమాండ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati

రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని కోరారు. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.