మనుబోలమ్మ ఆలయంలో హుండీ చోరీ కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా సర్వేపల్లి పరిధిలోని మనుబోలమ్మ ఆలయంలో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హుండీ తాళాలు పగలగొట్టి నగదు అపహరించారు. ఏడాదిలో కనీసం రెండుసార్లు ఇలాంటి చోరీలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ భద్రతను పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో నిఘా పెట్టాలని గ్రామస్థులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.