కరకగూడెం జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలపై అవగాహన
రిపోర్టర్: మహేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ముందస్తు ఆరోగ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి అరుణ గుమ్మడి విద్యార్థులకు ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.