రీసర్వేలో భూముల విస్తీర్ణం తగ్గింపు: అధికారుల అవినీతిపై నెల్లూరు ప్రజల ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో భూముల రీసర్వే అవినీతికి నిలయంగా మారిందని, సామాన్యుల భూముల విస్తీర్ణం తగ్గిస్తూ రెవెన్యూ సిబ్బంది లక్షలు వసూలు చేస్తున్నారని చింతోడు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో అధికారుల అక్రమాలపై ప్రతి సోమవారం కలెక్టరేట్కు యాభైకి పైగా ఫిర్యాదులు వస్తున్నాయని తేలింది. తప్పులను సరిదిద్దాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో దోపిడీ ఆగడం లేదని, దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.