విజయనగరం జిల్లాలో తుపాను పరిస్థితులు: కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో అర్నబ్ తుపాను నేపథ్యంలో రాత్రి సమయంలో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తుపాన్ పరిస్థితులపై సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో భాగంగా విద్యుత్ స్తంభం నుంచి జారిపడి మృతి చెందిన జేఎల్ఎం దువ్వాడ పైడిరాజు మృతి పట్ల కలెక్టర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పారు.