వివాదంలో సిద్ధార్థ్ మల్హోత్రా వ్వాన్ సినిమా ట్రైలర్
రిపోర్టర్: హరి
స్థలం: భారతదేశం
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటిస్తున్న వ్వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ సినిమా ట్రైలర్ వివాదంలో చిక్కుకుంది. గాయకుడు సర్గమ్ వైష్ తన అనుమతి లేకుండానే తన ఒరిజినల్ పాటను ట్రైలర్ లో వాడారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటను ఇప్పటికే ఒక ప్రముఖ మ్యూజిక్ లేబుల్ తో ఒప్పందం చేసుకున్నానని, తక్షణమే పాటను తొలగించాలని లేదా సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.