టీమ్ఇండియాకు భారీ షాక్: మూడో వన్డేకు స్టార్ పేసర్ ప్రసిద్ధ్ దూరం

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన టీమ్ఇండియా స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడో వన్డేకు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. ఎడమ కాలి తొడ కండర గాయం కారణంగా అతడు తప్పుకున్నాడని, ఆ స్థానంలో అన్షుల్ కాంబోజ్ను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీ20 సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ను తప్పించి రంజీ ట్రోఫీ ఆడేందుకు బోర్డు అనుమతినిచ్చింది.