బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సూరి, సుహాస్ ల మండాడి మూవీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

కోలీవుడ్ నటుడు సూరి, టాలెంటెడ్ నటుడు సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'మండాడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. మాథిమారన్ పుగళేంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 6.55 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కూడా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.