దిల్లీ భవన కూల్చివేత ఘటనలో నలుగురి అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

దిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కూలిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు, పీజీ యజమాని హరిరామ్ గుప్తాతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా, క్షతగాత్రులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది.