ముఖ్యమంత్రి చంద్రబాబుపై సైకోల మాటల దాడిని చూసి వరుణుడే ఆగ్రహించాడంటూ దేవినేని ఉమా మండిపాటు
రిపోర్టర్: హరి
స్థలం: ఎన్టీఆర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కొందరు సైకోలు చేస్తున్న మాటల దాడిని చూసి వరుణుడే ఆగ్రహించినట్లుందని మాజీ మంత్రి, మైలవరం నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాగులు, వంకలు, జలాశయాలు సమృద్ధిగా నీటితో నిండిపోయాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ భారీ వర్షాలు ఆ సైకోల నోర్లు మూయించాయని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ప్రకృతి కరుణించి జలాశయాలు నిండేలా చేసిందని, ఈ పరిణామాలు ప్రభుత్వ పాలనపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.