రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైసిపి నేతను పరామర్శించిన చింతాడ రవికుమార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆమదాలవలస

ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామానికి చెందిన వైసిపి మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ మెట్ట వసంతరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం ఆయనను పరామర్శించారు.

వసంతరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రవికుమార్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వసంతరావుకు ధైర్యం చెప్పారు.