నర్సంపేటలో వర్షాభావం.. ఆరు మండలాల్లో సున్నా వర్షపాతం!

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా నెలకొన్నాయి. నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో గత 24 గంటల్లో వర్షపాతం సున్నాగా నమోదైంది. జిల్లాలోని మొత్తం 13 మండలాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

జిల్లా సగటు వర్షపాతం కూడా 0.0 మి.మీ.గా నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటల సాగుకు వర్షం కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు.