నాని సుజీత్ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్లో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. యూకే ఫుడ్ మాఫియా నేపథ్యంలో డార్క్ హ్యూమర్, యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని, ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. నాని సరసన నటించేందుకు ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది.