చిలుకల కోసం మహావృక్షం పెంచిన మెకానిక్!
రిపోర్టర్: మహేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని శివగంగ జిల్లాకు చెందిన మోటార్ మెకానిక్ మునియాండి, చిలుకల పట్ల తన అపారమైన ప్రేమను చాటుకుంటున్నారు. పక్షుల ఆవాసాలు ధ్వంసమవడాన్ని చూసి చలించి, స్వయంగా మర్రిచెట్టు నాటి, దాన్ని మహావృక్షంగా పెంచారు. గత 25 ఏళ్లుగా వందలాది చిలుకలకు ఆహారం, నీరు అందిస్తూ ఆశ్రయం కల్పిస్తున్నారు. "ప్రతి రోజు పనికి వెళ్లే ముందు చిలుకలతో సమయం గడపడమే నా మొదటి పని" అని మునియాండి తెలిపారు. ఆయన సేవకు పలువురు స్ఫూర్తి పొందుతున్నారు.