విద్యార్థుల హక్కుల కోసం రోడ్డెక్కిన యువమోర్చా ఆక్రోశ గర్జన
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
తెలంగాణ రాష్ట్రంలో నయవంచన పాలన కొనసాగుతోందని, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న యువమోర్చా కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయలేరని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేవైఎం కో-కన్వీనర్ నేనావత్ రవి రాథోడ్ స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.