భక్తిపారవశ్యంతో పులకించిన మారుతి మందిర సప్తగిరి శిఖరాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో శనివారం స్వామివారికి అభిషేకం, నాగావళి దళార్చన, హారతి తదితర ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు శాస్త్రోక్తంగా సాగాయి. శనివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులందరికీ ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు.