భారత్ తో సిరీస్ మాకు పెద్ద సవాల్: మిచెల్ సాంట్నర్

రిపోర్టర్: హరి స్థలం: New Zealand

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో తలపడటం తమకు పెద్ద సవాల్ అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. వన్డేల్లో భారత్ ను వారి గడ్డపై ఓడించడమే తమ తొలి లక్ష్యమని సాంట్నర్ స్పష్టం చేశారు.