కేరళ రోడ్డు ప్రమాద ఘటన: హైకోర్టును ఆశ్రయించనున్న జయబాలకృష్ణన్ కుటుంబ సభ్యులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Kerala

కేరళలోని చెరనల్లూరులో జడ్జి మైనర్ కుమారుడు నడిపిన కారు ఢీకొని మృతిచెందిన జయబాలకృష్ణన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో నిందితుడైన బాలుడితో పాటు అతడి తండ్రిని కూడా వెంటనే అరెస్టు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. డెబ్బై రెండు గంటల పాటు సాగిన నిరసనను తాత్కాలికంగా విరమించుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.