పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వరరావు ప్రమాణస్వీకారం
రిపోర్టర్: నరేష్
స్థలం: బిహార్
తెలుగువారైన జస్టిస్ వి.కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. బిహార్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొన్నమండకు చెందిన జస్టిస్ కామేశ్వరరావు నియామకంపై తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది.