నగరి మున్సిపాలిటీ ఎన్నికల అడ్డంకులపై పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ మంత్రి రోజా
రిపోర్టర్: వెంకట్
స్థలం: Nagari
నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని, వైసీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని Telugufeedsite వెల్లడించారు. ఇంటి వద్ద నుంచి నగరి మున్సిపాలిటీకి వెళ్లేందుకు సిద్ధమైన ఆమెను పోలీసులు ఇనుప కంచె వేసి రోడ్డుపై అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఆమె అక్కడ నిరసన తెలిపారు.