మహబూబాబాద్ లో కలకలం: రోడ్డు పక్కన మానవ అవయవాలను పోలిన గుండె లభ్యం

రిపోర్టర్: సునీల్ స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా చిన్న వంగర బైపాస్ రహదారి పక్కన మానవ అవయవాలను పోలిన గుండె, లివర్ కనిపించడం తీవ్ర కలకలం రేపిందని పోలీసులు తెలిపారు. ఈ వస్తువులను గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అవి మానవ అవయవాలా లేదా జంతువులవా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనకు తరలించి అన్ని కోణాల్ లో తీవ్రంగా ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.