ద్వేషానికి తావులేకుండా ఉద్యమం సాగించాలంటూ అభిజీత్ దీప్కే పిలుపు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనలోకి ద్వేషాన్ని రానివ్వకూడదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేస్తూ, మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గంలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ముందుకు సాగాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఉద్యమకారులు ఎదుర్కొంటున్న కష్టాలపై స్పందిస్తూ, కార్యకర్తలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కుటుంబాలను కూడా గౌరవించాలని కోరారు.