చెత్తతో అద్భుత రోబోట్లు తయారు చేస్తున్న 12 ఏళ్ల బాలుడు

రిపోర్టర్: శివ స్థలం: కేరళ

కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పౌలోస్ వ్యర్థ పదార్థాలతో అద్భుతమైన రోబోట్లు, ఆటోమేటిక్ వస్తువులను తయారు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. అట్టపెట్టెలు, పాత వైర్లు, బ్యాటరీలను ఉపయోగించి రిమోట్ కర్టెన్లు, ఫుడ్ స్టిరర్ వంటి వినూత్న పరికరాలను రూపొందించాడు. ఈ చిన్నారి ప్రతిభను కేరళ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.