ఏపీలో రేషన్ బియ్యం నాణ్యత పెంపు, ఇక కేవలం 10 శాతం నూకలు!

రిపోర్టర్: కిరణ్ స్థలం: Andhra Pradesh

ఏపీలో పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం నాణ్యతను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా కేవలం పది శాతం మాత్రమే నూకలు ఉన్న నాణ్యమైన బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలోని పదిహేడు జిల్లాల్లో ఈ కొత్త విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా, రాబోయే రోజుల్లో మిగతా జిల్లాలకు కూడా పూర్తిగా విస్తరించనున్నారు.