చౌటుప్పల్ లో దారుణం: శివసత్తు హత్యతో పాటు భారీ దోపిడీ కలకలం

రిపోర్టర్: సునీల్ స్థలం: చౌటుప్పల్

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శివసత్తు జోగిని రాళ్లబండి సుధాకర్ దారుణ హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. మార్కండేయ నగర్ కాలనీలో నివసించే సుధాకర్ కళ్లలో పెప్పర్ స్ప్రే ప్రయోగించి, కాళ్లు చేతులు కట్టేసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్ లోని బంగారం, నగదుతో పాటు ఆయన వాహనాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్ లో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.