టెక్ రంగంలో భారీ షాక్: ఉద్యోగులను తొలగించిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు పాల్పడిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సంస్థలో అనవసరమైన బ్యూరోక్రసీని తొలగించే లక్ష్యంతో ఈ తాజా కోతలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. భారత్ సహా వివిధ దేశాలలో స్టోర్స్ బిజినెస్ విభాగానికి చెందిన వెయ్యి మంది కంటే తక్కువ ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు సమాచారం. ఈ పరిణామంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.