'బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి వైఖరిపై అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్'
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను నమ్మే వారు తమ కుమార్తెల ఆస్తి హక్కులను కాలరాస్తున్నారని ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. వీళ్లు విల్లు రాసి పూర్తిగా కొడుకులకే ఆస్తులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఓ బహిరంగ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. మహిళల హక్కులు, ఆస్తుల పంపిణీ విషయంలో ఆ పార్టీల వైఖరి పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.