అమలాపురం 28వ వార్డులో కూటమి అభ్యర్థి మోకా సుబ్బారావు ప్రచారం
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అమలాపురం
అమలాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మోకా వెంకట సుబ్బారావు బరిలోకి దిగారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.