రాజమహేంద్రవరంలో నేడు పోలవరం అథారిటీ కీలక సమావేశం
రిపోర్టర్: హరి
స్థలం: తూర్పు గోదావరి
రాజమహేంద్రవరంలో నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం జరగనుంది. సీఈవో సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 12 ప్రధాన ఎజెండా అంశాలపై చర్చిస్తారు. 2026-27 పనుల ప్రణాళిక, పురోగతి, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌తో పాటు పలువురు అధికారులు హాజరుకానున్నారు.