విజయవాడలో 72 అడుగుల మహా గణపతిని దర్శించుకున్న వంగలపూడి అనిత

రిపోర్టర్: శివ స్థలం: అనకాపల్లి

విజయవాడ విద్యాధరపురం సితార గ్రౌండ్స్‌లో డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో కొలువుదీరిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహాగణపతిని మంత్రి అనిత దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ గణపతి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.