యూసీసీ సమానత్వం కోసం కాదు, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికే: అసదుద్దీన్ ఒవైసీ
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేయడం సమానత్వం కోసం కాదని, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికేనని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. 2029 నాటికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో, బీజేపీ మిత్రపక్షాలు తమ స్వతంత్ర రాజకీయ గళాన్ని వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు.