కోల్ స్కామ్తో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైందంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అంధకారంలోకి వెళ్లిందని, ఎక్కడా ఆరు గంటలకు మించి కరెంట్ ఉండటం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. జెన్కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్లే విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లలో నిజానిజాలు తేల్చేందుకు నేడు బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ప్రజల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.