మిర్జాపూర్ సినిమాకు వస్తున్న స్పందనపై దర్శకుడు గుర్మీత్ సింగ్ హర్షం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Mumbai
ప్రముఖ వెబ్ సిరీస్ మిర్జాపూర్ ఆధారంగా తెరకెక్కిన చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో అద్భుతమైన స్పందన లభించిందని దర్శకుడు గుర్మీత్ సింగ్ వెల్లడించారు. సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలనే అభిమానుల చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరిందని ఆయన తెలిపారు. మొదటి సీజన్ ప్రదర్శించినప్పుడే ఈ కథకు థియేటర్ స్థాయి అనుభూతి ఉందని గుర్తించామని, నిర్మాత రితేష్ సి్వానీ ప్రోత్సాహంతోనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని చెప్పారు. భిన్నమైన జోనర్స్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.