ప్రజాపాలనలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హుస్నాబాద్

రిపోర్టర్: సతీష్ స్థలం: సిద్దిపేట

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ హుస్నాబాద్ను సందర్శించాలని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజాపాలనలో హుస్నాబాద్ ప్రాంతం ఒక ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని అర్బన్ పార్క్ పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోందని, ప్రజలు సేద తీర్చుకోవడానికి ఇది సరైన వేదికని ఆయన తెలిపారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.