తీవ్ర తుఫాను ప్రభావం: ఏపీలో నూట ముప్పై రైళ్లు రద్దు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర తుఫాన్ ప్రభావంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, విజయవాడ మీదుగా వెళ్లాల్సిన నూట ముప్పైకి పైగా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వార్‌రూమ్‌లతో పాటు ట్రాక్ పునరుద్ధరణ బృందాలను సిద్ధంగా ఉంచామని అధికారులు స్పష్టం చేశారు.