'మద్యం, బిర్యానీ కావాలంటూ వేధింపులు': ఏసీబీకి చిక్కిన కీసర పోలీసు అధికారులు

రిపోర్టర్: గోపి స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో నిందితుడిని లంచం కోసం వేధించడంతో పాటు మద్యం, బిర్యానీ కావాలంటూ తరచూ ఆర్డర్లు ఇచ్చి అసభ్య పదజాలంతో దూషించిన ఇన్‌స్పెక్టర్ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు.. కీసర ప్రాంతంలోని చెరువు కట్ట వద్ద లంచం తీసుకుంటుండగా వారిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.