స్టీవ్ జాబ్స్ బ్లాక్ టర్టిల్ నెక్ వెనుక అసలు రహస్యం బట్టబయలు
రిపోర్టర్: గోపి
స్థలం: Global
యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించే నలుపు రంగు టర్టిల్ నెక్ టీ షర్ట్ వెనుక ఆసక్తికరమైన కథ ఉందని ఆయన జీవిత చరిత్ర రాసిన వాల్టర్ ఐజాక్సన్ వెల్లడించారు. జపాన్ టూర్ సందర్భంగా సోనీ కంపెనీ యూనిఫామ్స్ చూసి స్ఫూర్తి పొందిన జాబ్స్, ప్రసిద్ధ డిజైనర్ ఇస్సే మియాకే చేత వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారని, ఈ సరళతే యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్లలోనూ స్పష్టంగా ప్రతిఫలించిందని ఆయన స్పష్టం చేశారు.