విద్యార్థులకు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ప్రకటించిన ఎయిర్ ఇండియా
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణాలపై విద్యార్థులకు పది శాతం డిస్కౌంట్‌తో పాటు అదనపు లగేజీ, తక్కువ ధరకు తేదీ మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 20, 2026 వరకు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేసింది.