యువతకు తీపి కబురు: సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గడువు పొడిగింపు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026 దరఖాస్తు గడువును నవంబర్ ఆరో తేదీ వరకు పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను సమర్పించేందుకు ఈ అదనపు సమయం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పాఠశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.