చాకలి ఐలమ్మ జయంతి రాష్ట్ర కన్వీనర్గా ఐరేని నవీన్ నియామకం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రానికి చెందిన ఐరేని నవీన్ కుమార్ చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు. శనివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. ఈ నియామకం పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.