నార్త్ కరోలినాలో ఘనంగా తానా 5కె రన్ కార్యక్రమం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: North Carolina

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలోని ఛార్లెట్‌లో నిర్వహించిన 5కె రన్ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఫ్రాంక్ లిస్కే పార్క్‌లో జరిగిన ఈ వేడుకకు దాదాపు 400 మందికి పైగా హాజరయ్యారు. తానా టీమ్ స్క్వేర్ నిధుల సేకరణలో భాగంగా చేపట్టిన ఈ రన్‌లో తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాలను వివరించారు.