వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యాధికారి ప్రత్యేక దృష్టి

రిపోర్టర్: AHMED స్థలం: మహమ్మదాపురం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను వైద్యాధికారి డాక్టర్ వి. శ్రీకావ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రతపై వార్డెన్కు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. తాగునీటి నమూనాలను సేకరించి ఆర్వో నీటిని మాత్రమే తాగాలని ఆమె సూచించారు.