ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాంశు షోకీన్ ఉపాధ్యక్ష పదవిని గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించారు. ప్రధాన విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చిన ఆయన, డీయూఎస్‌యూ చరిత్రలో ఉపాధ్యక్ష పదవి దక్కించుకున్న తొలి స్వతంత్ర అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. పశ్చిమ ఢిల్లీలోని పీరగఢీకి చెందిన సాధారణ బస్ కండక్టర్ కుమారుడైన దీపాంశు విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.