వైద్య రంగంలో కీలక మైలురాయి: క్యాన్సర్ కణాల అంతు చూసేందుకు కొత్త పరికరం రూపకల్పన

రిపోర్టర్: రమేష్ స్థలం: బెంగళూరు

గణిత శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్ లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకులు క్యాన్సర్ చికిత్సలో కీలక విజయం సాధించారు. కంతిలోని లోతైన ప్రాంతాల్ లో క్యాన్సర్ మందులు ఎందుకు తక్కువ ప్రభావం చూపుతున్నాయో కనుగొనేందుకు తక్కువ ఖర్చుతో కూడిన త్రీడీ ప్రింటెడ్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వినూత్న పరికరం ద్వారా కణితి లోపలి వాతావరణాన్ని పరిశోధించి, మందుల పనితీరును అంచనా వేయవచ్చని నిపుణులు వెల్లడించారు.