టాలీవుడ్లో కొత్త అధ్యాయం: ఐకాన్జా కార్యాలయాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తన తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అక్టోబర్ 1న 'ఐకాన్జా' పేరుతో కొత్త సృజనాత్మక కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సరికొత్త ఆఫీస్ వేదికగా భవిష్యత్ సినిమా ప్రాజెక్టులు, కథా చర్చలు, నూతన కాన్సెప్టుల రూపకల్పన వంటి కార్యక్రమాలు జోరుగా సాగనున్నట్లు ఆయన వెల్లడించారు. సినిమా రంగంలో కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు.