భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు కన్నీరుమున్నీరవుతున్న బాధితుడు

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోటమిసాల పంచాయతీ పరిధిలోని జానుగురు గ్రామంలో భారీ వర్షాల కారణంగా సీదేరి అర్జున్ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోవడంతో పాటు నిత్యావసరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో నిరాశ్రయులైన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని బాధితుడు అధికారులను వేడుకుంటున్నారు.