నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు జిల్లాలో పోలీస్ ప్రజల విశ్వాసమే లక్ష్యంగా అన్ని స్టేషన్ల పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ అజిత వెజెండ్ల ఆదేశాలతో అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.